రీల్స్ కోసం డేంజరస్ ఫీట్: హైస్పీడ్లో ఉన్న రెండు స్పోర్ట్స్ కార్లపై దూకిన YouTube స్టార్ 

రీల్స్ కోసం డేంజరస్ ఫీట్: హైస్పీడ్లో ఉన్న రెండు స్పోర్ట్స్ కార్లపై దూకిన YouTube స్టార్ 

ఎంత సాహసం.. ఏమాత్రం అంచనాలు తప్పినా.. ప్రాణాలు పోతాయి.. అయినా అడ్వెంచర్ చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఎవరూ ఊహించని, చూడని ఫీట్ సాధించాడు యూట్యూబర్..  రీల్స్ చేస్తూ యూట్యూబ్ లో ఫేమస్ అయిన IShowSpeed యూట్యూబర్ డారెన్.. రెండుకార్లను లైవ్ ఆన్ స్ట్రీమ్ పై సక్సెస్ ఫుల్ గా దూకడం ద్వారా ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించాడు.

ఈ ప్రమాదకరమైన స్టంట్ వద్దు అని ఎంతమంది వారించిన డారెన్ ఊరుకోలేదు.. తాను ఈ ఫీట్ చేసి తీరుతానని చెప్పి అనుకున్నట్లుగానే సక్సెస్ సాధించి చూపించాడు.. ఈ డేంజరస్ ఫీట్ తర్వాత డారెన్ ఆనందానికి అవధుల్లేవు.. ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న యూట్యూబర్ డారెన్ డేంజరస్ ఫీట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు X, టిక్ టాక్, Reddit లలో వైరల్ అవుతున్నాయి. 

ఈ వీడియోలో డారెన్ తన సాహసోపేతమైన ప్రమాదకరమైన స్టంట్ ను చూపిస్తుంది. వేగంగా వస్తున్న రెండు స్పోర్ట్స్ కార్లు.. వాయు వేగంలో డారెన్ వైపు దూసుకువస్తున్నట్లు కనిపిస్తుంది. స్పోర్ట్స్ కార్ల స్పీడ్ ను అంచనా వేసుకొని అందుకు తగ్గట్టుగా పైకి సక్సెస్ ఫుల్ వాటిపై జంప్ చేశారు డారెన్.  ఈప్రమాదకర ఫీట్ లో ఏమాత్రం అంచనా తప్పినా పైప్రాణాలు పైకే పోవడం ఖాయం.. అటువంటి ఫీట్ మరీ.. ఎంతమంది తన అనుచరులు వారిస్తున్నా డారెన్ ఈ ఫీట్ చేశారు.. సక్సెస్ ఫుల్ ఫీట్ తర్వాత డారెన్ ఆనందానికి అంతులేదు.. 

ఈ ఫీట్ కు ముందు ‘‘ నా వయస్సు 30.. నాకు కేవలం 30 సెకన్లు.. 30 సెకన్లు టైం ఇవ్వండి .. నేనేంటో చూపిస్తాను అంటూ డారెన్ తన వారితో వాదనకుదిగాడు.. అయితే వారు ఒప్పుకోలేదు.. ఎలాగోలా వారిని ఒప్పించి ప్రాణాలు పణంగా పెట్టి డారెన్ ఈ ఫీట్ ను సాధించాడు.. 

రీల్స్ కోసం డారెన్ చేసిన సాహసం మెచ్చుకోకతప్పదు.. అని నెటిజన్లు అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి ఫీట్ చేయడం అవసరమా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవడమెందుకు?  అని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఏదీ ఏమైనా డారెన్ ఓ గ్రేట్ ఫీట్ సాధించాడు.. గ్రేట్ గ్రేట్..