యూట్యూబ్లో 'స్టోరీస్' ఫీచర్‌ నిలిపివేత..ఇదే కారణం

యూట్యూబ్లో 'స్టోరీస్' ఫీచర్‌ నిలిపివేత..ఇదే కారణం

వీడియో షేరింగ్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది.  జూన్ 26 నుంచి యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూ ట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి  ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో భాగంగా ఈ  నిర్ణయం తీసుకుంది.

ఈజీ అప్‌డేట్‌ షేరింగ్, కంటెంట్‌ ప్రచారం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లను ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తోంది. ఇందుకు యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు బెస్ట్ అని అనుకుంటోంది. ఎందుకంటే స్టోరీస్ ఫీచర్ తో పోలిస్తే యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు.. ఎక్కువ వ్యూయర్ షిప్ తో పాటు.. కామెంట్‌లు, లైక్‌లు వస్తాయి. ఇవి యూజర్లకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి. 

వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది పొడవునా కొత్త ఫీచర్‌లతో షార్ట్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లను మెరుగుపరచడం కొనసాగిస్తామని యూట్యూబ్ చెబుతోంది.

యూట్యూబ్ లో రీల్స్ పేరుతో 2017లో ఈ స్టోరీ ఫీచర్ ను యూట్యూబ్ పరిచయం చేసింది.  10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న స్టోరీస్ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. వారు ఇన్ స్టా స్టోరీస్ మాదిరిగానే ఈ ఫీచర్ ని ఉపయోగించవచ్చు, ఇవి 7 రోజుల వరకు వీక్షించగలిగే చిన్న వీడియోలను షేర్ చేయడానికి ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది.