యాంగ్రీ రాంట్ మ్యాన్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలతో పాటు వివిధ అంశాల పట్ల తనదైన స్టైల్ లో విశ్లేషణ ఇస్తూ ఫేమస్ అయ్యాడు ఈ యూట్యూబర్.కేవలం సెల్ఫీ విడియోలతోనే ఫేమ్ సంపాదించిన ఈ యూట్యూబర్ ముల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ఫేయిల్యూర్ అవ్వడం వల్ల ఇవాళ ( బుధవారం ) మరణించాడు. ఇతనికి ఈ మధ్యనే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యిందని, అది సెట్ అవ్వక ముల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయని తెలుస్తోంది.
RIP #AngryRantMan
— Ramesh Bala (@rameshlaus) April 17, 2024
He is one of my favorite YouTube reviewers.. Gone too soon.. 💔 pic.twitter.com/yC3hAdqaop
చిన్న వయసులోనే ఇతను మరణించటం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. నిజాన్ని నిర్భయంగా చెప్పే దైర్యం ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో ఇతను ఒకడని ఇంత చిన్న వయసులో మరణించటం చాలా బాధాకరం అని అంటున్నారు. యాంగ్రీ రాంట్ మ్యాన్ గా ఫేమ్ సాధించిన ఇతని పేరు అభ్రదీప్ సాహా.ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్ లోనే ఇతను ఒక రేర్ క్యాటగిరి అని, ఇతని మరణం తీరని లోటని నెటిజన్లు అంటున్నారు.