Bigg boss OTT: ఇదేందయ్యా ఇది.. ఇద్దరు భార్యలతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు

Bigg boss OTT: ఇదేందయ్యా ఇది.. ఇద్దరు భార్యలతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు

నిజానికి బిగ్ బాస్ అనేది ఒక క్రేజీ షో. పరిచయం లేని కొంతమందిని ఒక ఇంట్లో ఉంచి. టైం, మొబైల్ తో సంబందం లేకుండా, వారికి చిన్న చిన్న టాస్కులు పెడుతూ, మధ్యలో గొడవలు పపెడుతూ.. దాదాపు 100 రోజులపాటు సాగే ఆటనే బిగ్ బాస్. అయితే.. ఇలాంటి క్రేజీ షోకి అంతకన్నా క్రేజీ వ్యక్తులు వస్తే ఎలా ఉంటుంది. ఎంటెర్టైన్మెంట్ నెక్స్ట్ లేవల్లో ఉంటుంది కదా. అలానే ఆలోచించారో ఏమో తెలియదు కానీ, హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3లో ఇలాంటి వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 

అదేంటంటే.. హిందీలో ఇటీవలే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 మొదలయ్యింది. ఈ సీజన్ లో తొలిసారి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ హోస్ట్ గా చేస్తున్నారు. అయితే.. ఇంతకాలం సెలబ్రెటీలకు, సెలబ్రెటీ జంటలకు మాత్రమే అనుమతిచ్చిన బిగ్ బాస్ లోకి తాజాగా ఒక వినూత్న జంట.. కాదు కాదు.. ఎలా చెప్పాలబ్బా.. ఒక వ్యక్తి తన ఇద్దరు భార్యలతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఆర్మాన్‌ మాలిక్‌. అతనొక యూట్యూబర్‌. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పాయల్ మాలిక్, రెండో భార్య క్రితికా మాలిక్.

అలా తన ఇద్దరి భార్యలతో కలిసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి భార్యతో వెళ్లడమే పెద్ద రిస్క్. అలాంటిది నువ్వు ఇద్దరు భార్యలతో వెళ్ళావంటే.. నువ్వు మాములోడివి కాదు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇద్దరు భార్యలతో ఆర్మాన్ మాలిక్ ఎలా ముందుకు సాగుతాడో చూడాలి.