ఆ నలుగురికి హౌస్‍లో ఉండే అర్హత లేదు: బిగ్‌బాస్‌ సీజన్‌-8 ఫస్ట్‌ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్

ఆ నలుగురికి హౌస్‍లో ఉండే అర్హత లేదు: బిగ్‌బాస్‌ సీజన్‌-8 ఫస్ట్‌ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్

బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss Season8) నుండి యూట్యూబర్ బెజవాడ బేబక్క (Bezawada Bebakka) ఎలిమినేట్ అయిపోయింది. ఈ మేరకు మొదటి వారంలోనే బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన బెజవాడ బేబక్క ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

అయితే బేబక్క తన మాటలు, ప్రాసలు, పంచ్‌డైలాగ్స్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈమె ఆట తీరుకి..చాలా మంది ఫైనల్ వరకు ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమె ఆట గాడితప్పింది. ఇక తన ఎలిమినేషన్ ను ఊహించని బేబక్క స్టేజిపై ఎమోషన్ అయింది. బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అది ఎపిసోడ్ చూసిన వాళ్లకి క్లియర్ గా అర్థమైంది.

ఎలిమినేషన్ కంటెస్టెంట్స్:

ఈ వారం విష్ణు ప్రియ, బేబక్క, సోనియా, పృథ్వీరాజ్‌, శేఖర్‌ బాషా, నాగ మణికంఠలు నామినేట్‌ అవ్వగా చివరకు బేబక్క, మణికంఠలు మిగిలారు. ప్రేక్షకుల నుంచి బేబక్కకు తక్కువ ఓట్లు వచ్చినట్లు ఎలిమినేషన్‌ సందర్భంగా నాగార్జున ప్రకటించారు.

ఎలిమినేషన్ తర్వాత బేబక్క మాట్లాడారు. హౌస్‍లో ఉండేదుకు అనర్హులు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగితే.. నలుగురు కంటెస్టెంట్ల పేర్లు చెప్పారు బేబక్క. ఓ బోర్డుపై కంటెస్టెంట్ల ఫొటోలు పెట్టి..అందులో రోడ్‍లా ఉన్నదానిపై వారి ఫొటోలను అతికించాలని నాగ్ చెప్పారు. హౌస్‍లో ఉండేందుకు సోనియా, పృథ్విరాజ్, నిఖిల్, మణికంఠకు అర్హత లేదని బేబక్క చెప్పారు.

Also Read :- దేవర ట్రైలర్ టైమ్ ఆగయా

బేబక్క ఎమోషనల్:

అనంతరం వేదిక మీదకు వచ్చిన బేబక్క మాట్లాడుతూ.."ఇంత ఫాస్ట్‌గా బయటకు వచ్చేస్తానని నేనైతే అనుకోలేదు. తనకు ఇంకా అవకాశం ఇస్తే, బాగా ఆడి తనని తాను నిరూపించుకునేదాన్నని అన్నారు.  అవకాశం మిస్ అయిందనే బాధ ఉంది. ఇది లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని అనుకుంటాను.ఈ జీవిత అనుభవాన్ని మర్చిపోలేని బేబక్క తెలిపారు.

బేబక్క, మణికంఠ మధ్య ఉత్కంఠ

బేబక్క, మణికంఠ చివర్లో డేంజర్ జోన్‍లో నిలిచారు. పేపర్ ఓపెన్ చేసి ఎవిక్టెడ్ ఉన్న వారు ఎలిమినేట్ అయినట్టు నాగార్జున వారిద్దరికీ చెప్పారు. చివరికి బేబక్క ఎలిమినేట్ అయ్యారు. మరో అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు మణికంఠ. తాను ఇప్పటి నుంచి బెటర్‌గా ఉంటానని అన్నారు.ఈ క్రమంలో నామినేషన్ల నుంచి పృథ్విరాజ్, విష్ణుప్రియ, మణికంఠ సేవ్ అయ్యారు.