అర్లింగ్టన్ (టెక్సాస్): దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన లెజెండ్ బాక్సర్ మైక్ టైసన్‌కు పరాజయం తప్పలేదు. శనివారం జరిగిన బౌట్‌లో 27 ఏళ్ల యంగ్ బాక్సర్ జేక్ పాల్.. టైసన్‌ను ఓడించాడు. ఈ బౌట్‌కు పెద్ద హైప్ వచ్చినా రింగ్‌లో ఇద్దరు బాక్సర్ల మధ్య పెద్దగా పంచ్‌ల వర్షం కురవలేదు. దీంతో జడ్జిలు ఏకగ్రీవంగా పాల్‌ను విన్నర్‌గా ప్రకటించారు. ఇద్దరు జడ్జిలు పాల్‌కు అనుకూలంగా 80–72, 79–73 పాయింట్లు ఇచ్చారు.
ఓపెనింగ్ బెల్ తర్వాత పాల్‌పై పంచ్‌లకు దిగిన టైసన్ తర్వాత వెనకబడ్డాడు. కొన్ని రౌండ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. భారీ గ్లోవ్స్ ధరించడం టైసన్‌కు ఇబ్బందిగా మారింది. పాల్ తన వద్దకు వచ్చేవరకు వేచిచూసి ఆ తర్వాత పంచ్‌లు కొట్టడం మైనస్‌గా మారింది. అదే టైమ్‌లో పాల్ కొన్ని వైల్డ్ షాట్స్‌తో టైసన్‌ను నిలువరించాడు. షెడ్యూల్ ప్రకారం ఈ పోటీ జులై 20న జరగాల్సి ఉన్నా టైసన్ అనారోగ్య కారణాలతో వాయిదా వేశారు. ఈ బౌట్ వల్ల టైసన్‌కు సుమారు రూ. 168 కోట్లు రాగా, పాల్‌కు రూ. 337 కోట్ల దక్కనున్నాయి.
Elon musk change like button 🔥👏❤️
— it's cinema (@its__cinema) November 16, 2024
He's 58, and he didn't get KO'd..
Mike Tyson was the GOAT & Still the GOAT..
Respect 🙌
Legends never fade! What an epic fight! #TysonPaul #Tyson #PaulTyson #MikeTyson #MikeTysonVsJackPaul #Mike #jake pic.twitter.com/u0kKWIek3V