ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ మృతి చెందారు. 2023 జూన్ 25 సోమవారం రోజున రాయ్‌పూర్‌లో వీడియో షూట్ చేయడానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో కన్నుముశాడు. దేవ్‌రాజ్ వెళ్తున్న బైకును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. లభండి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
దేవ్‌రాజ్ పటేల్ మృతి పట్ల ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. అతడు చేసిన ఓ పాత వీడియోను పోస్ట్ చేస్తూ.. ''దిల్ సే బురా లగ్తా హై'తో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ఆయన ట్వీట్ చేశారు.
'దిల్ సే బురా లగ్తా హై' అనే డైలాగ్‌తో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయనకు యూట్యూబ్‌లో అతనికి 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దేవ్‌రాజ్ పటేల్ చనిపోయే కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేయడం గమనార్హం. 2021లోభువన్ బామ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ధిండోరాలో దేవరాజ్ విద్యార్థి పాత్రను పోషించాడు.