మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ ఫైర్..ఎందుకంటే?

మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ ఫైర్..ఎందుకంటే?

సినిమా వాళ్లపై అసభ్యకర వీడియోలు చేస్తూన్న సోషల్ మీడియా యూట్యూబర్స్ పై టాలీవుడ్ హీరో, MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవలే అసహనం వ్యక్తం చేశారు.ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈ మేరకు 48 గంటల టైం ఇచ్చి అసభ్యకర కంటెంట్ డిలీట్ చేయని పలు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించాడు.సినిమా వాళ్ళ తరుపున ముందుండి నడిపిస్తున్న విష్ణుపై తాజాగా ఓ యూట్యూబర్ మంచు విష్ణు చేస్తున్న పనిపై దారుణమైన విమర్శలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా ఎంమంచు విష్ణు ఫ్యామిలీపై ఎప్పటినుంచో పలు యూట్యూబ్ ఛానల్స్ ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలపై, వారి సినిమాలపై ఎక్కువగా ట్రోల్స్ చేస్తారనే విషయం తెలిసిందే. అయితే, ఇటీవల మంచు విష్ణు తీస్తున్న కన్నప్ప సినిమా టీజర్ లో ఉన్న తప్పులని ట్రోల్ చేస్తూ పలువురు వీడియోలు కూడా చేసారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నప్ప టీజర్ నెగిటివ్ గా బాగా వైరల్ అవుతూ వచ్చింది. మంచి సినిమాని చెడగొడుతున్నావని విమర్శలు కూడా నెటిజన్స్ చేసారు.

అయితే మంచు విష్ణు ఇన్నాళ్లు బ్లాక్ చేయించిన ఆ యూట్యూబ్ ఛానల్స్ నటీనటులపై ట్రోల్స్ చేసినవి కాదని..కేవలం మంచు ఫ్యామిలీని, కన్నప్ప మూవీని ట్రోల్ చేసిన ఛానల్స్ అని ఓ యూట్యూబర్ వీడియోలో తెలిపాడు. ఆ యూట్యూబర్ మంచు విష్ణుపై దారుణమైన విమర్శలు చేస్తూ..కన్నప్ప సినిమా గురించి ట్రోల్స్ వేసినందుకు మాత్రమే యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేసాడని అన్నారు. చెప్పినవి 18 అయినా అనధికారికంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసాడు.

కావాలని ఎవ్వరి ఫ్యామిలీలను మేము ట్రోల్ చెయ్యట్లేదు. నిన్నే ట్రోల్ చేస్తున్నామంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. మా అసోసియేషన్ ని ఇలా వాడుకుంటున్నావు అంటూ ఆ యూట్యూబర్ మాట్లాడాడు. అంతేకాకుండా ఛానల్స్ బ్లాక్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కన్నప్ప గురించి పాజిటివ్ గా వీడియోలు చేస్తే ఛానల్స్ పై వేసిన స్ట్రైక్స్ వెంటనే తీయిస్తామని కూడా మెయిల్స్ చేసినట్టు తెలిపాడు. దీంతో ఈ యూట్యూబర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి మంచు విష్ణుని పలువురు విమర్శిస్తున్నారు. ఈ మేరకు మంచు టీమ్ కూడా మేం ఎలాంటి ఈ - మెయిల్స్ పంపలేదని కూడా క్లారిటీ ఇస్తూ నోటిస్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం మంచు విష్ణుపై చేసిన వీడియో వైరల్ అవుతుండటంతో ఈ సమస్య ఎంతవరకు వెళుతుందనేది తెలియాలి.