యూట్యూబ్‌ టు  సినిమాల్లోకి...

వెండితెర మీద కనిపించే యాక్టర్లకు పోటీగా నటిస్తూ, సంపాదిస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు యూట్యూబ్‌ స్టార్స్‌. కష్టపడి పనిచేస్తూ.. అద్భుతమైన కంటెంట్‌ని క్రియేట్‌ చేస్తున్నారు. అలాంటివాళ్లలో హర్ష్‌ బెనివల్‌ ఒకరు. హర్ష్​ ఫేమస్‌ ఇండియన్‌ యూట్యూబర్‌‌. ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ కంటెంట్‌ క్రియేట్‌ చేస్తూ 14.1 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లను మెప్పిస్తున్నాడు. 

ఇరవై ఆరేండ్ల హర్ష్‌‌‌‌ బెనివల్‌‌‌‌ పుట్టింది ఢిల్లీలో. స్కూల్‌‌‌‌, కాలేజీ చదువు ఢిల్లీలోనే పూర్తి చేశాడు. యూట్యూబ్‌‌‌‌లో వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయడం 2015లో మొదలుపెట్టాడు. చాలా తక్కువ టైంలోనే మంచి యాక్టర్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు. అతను చేసిన వీడియోలు సోషల్‌‌‌‌ మీడియాలో బాగా వైరల్‌‌‌‌ అయ్యేవి. హర్ష్​ ఎక్కువగా కామెడీ వీడియోలు చేస్తుంటాడు. అతని యాక్టింగ్‌‌‌‌కు మెచ్చి.. సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 2019లో ‘స్టూడెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌ 2’లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో హర్ష్​ నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అంతేకాదు నటుడు టైగర్ ష్రాఫ్‌‌‌‌ కూడా ఒక ఇంటర్వ్యూలో హర్ష్‌‌‌‌ యాక్టింగ్‌‌‌‌ని మెచ్చుకున్నాడు. హర్ష్‌‌‌‌ చేసే వీడియోల్లో ఎక్కువగా రియల్‌‌‌‌ లైఫ్‌‌‌‌లో జరిగే ఇన్సిడెంట్స్‌‌‌‌ ఉంటాయి. కాబట్టి అందరూ కనెక్ట్‌‌‌‌ అవుతారు. డైలీ లైఫ్‌‌‌‌లో ఎదురయ్యే విషయాలనుంచే కామెడీని క్రియేట్‌‌‌‌ చేయడంలో హర్ష్‌‌‌‌ దిట్ట. అతనికి -షొంటి, పాప్లు క్యారెక్టర్స్​ పేరుతెచ్చాయి. ఆ పాత్రల కోసమే ‘హర్ష్ బెనివాల్ 2.0’ పేరుతో రెండో ఛానెల్‌‌‌‌ని కూడా మొదలుపెట్టాడు. అందులో అతనికి 1.55 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఉన్నారు. 

సినిమా ఛాన్స్‌‌‌‌

యూట్యూబ్‌‌‌‌లో వీడియోలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో హర్ష్‌‌‌‌కు ఒక కాస్టింగ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి ఫోన్​ వచ్చింది. అతను అది ప్రాంక్‌‌‌‌ కాల్ అనుకుని లైట్‌‌‌‌ తీసుకున్నాడు. రెండోసారి ఫోన్​ చేసి, ఇంటి నుంచే ఆడిషన్ చేయమని అడిగారు. చేశాక, అది ప్రాంక్ కాదు నిజంగానే ఛాన్స్‌‌‌‌ వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. అవకాశాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అలాంటిది హర్ష్​కు మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే తన టాలెంట్​తో పెద్ద సినిమాలో అవకాశం దక్కింది. ఆ సినిమానే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2. 

ఫ్యామిలీ సపోర్ట్‌‌‌‌

హర్ష్‌‌‌‌ యూట్యూబ్‌‌‌‌ను కెరీర్‌‌‌‌‌‌‌‌గా ఎంచుకున్నప్పుడు తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. పైగా సపోర్ట్‌‌‌‌ చేశారు. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఎదిగానని ఎప్పుడూ చెప్తుంటాడు హర్ష్‌‌‌‌. కాలేజీ డేస్‌‌‌‌ నుంచే వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. అప్పట్లో పెద్దగా ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ లేకపోవడంతో సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌లోనే వీడియోలు తీసేవాడు. ఒక్కో వీడియోకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చయ్యేది. ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులే ఇచ్చేవాళ్లు. అప్పుడే కాదు.. ఇప్పటికీ హర్ష్‌‌‌‌ని వాళ్లు ఎంకరేజ్‌‌‌‌ చేస్తున్నారు.

టైం సరిపోవట్లే..

నీ లక్ష్యం ఏంటని హర్ష్​ని అడిగితే.. ‘‘ఇప్పుడు నేను ఎక్కువగా షూటింగ్​లతో బిజీగా ఉంటున్నా. అందుకే పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌ కోసం టైం స్పెండ్‌‌‌‌ చేయడం కుదరట్లేదు. భవిష్యత్తులో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి. నా గ్యారేజీలో లగ్జరీ స్పోర్ట్స్ కార్లు ఉండాలి. ఫ్యామిలీతో స్పెండ్‌‌‌‌ చేయడానికి కావాల్సినంత టైం ఉండాలి. అలా జాలీగా గడపడమే నా కిష్టం’’ అంటున్నాడు. 

ఫ్రెండ్స్‌‌‌‌ ఇన్​స్పిరేషన్​

‘‘నేను నా జీవితంలో కలుసుకున్న చాలామంది  వ్యక్తుల నుంచి  ఇన్​స్పైర్ అయ్యా. నా ఫ్రెండ్స్‌‌‌‌ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. వాళ్ల స్థాయి ఏమిటనేది ముఖ్యం కాదు. వాళ్ల వ్యక్తిత్వం ఎలాంటిదనేది ముఖ్యం. నేర్చుకోవాల్సిన లక్షణాలు ఎవరి దగ్గరున్నా నేర్చుకుంటా’’ అంటాడు హర్ష్‌‌‌‌. అంతేకాదు ఆయన సక్సెస్‌‌‌‌కు వాళ్ల అమ్మ ఇచ్చిన ఎంకరేజ్​మెంటే కారణమని చెప్తుంటాడు. హర్ష్‌‌‌‌ ఆమె దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడట. 

బాలీవుడ్ ఛాన్స్‌‌‌‌లు

ఇప్పటికే హర్ష్‌‌‌‌కు చాలా అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే.. వచ్చినవన్నీ కామెడీ క్యారెక్టర్లే. కానీ.. హర్ష్‌‌‌‌ కొన్నాళ్లు కామెడీకి బ్రేక్‌‌‌‌ ఇచ్చి, సీరియస్ క్యారెక్టర్లు చేద్దామనుకుంటున్నాడు. అందుకే వాటిని యాక్సెప్ట్‌‌‌‌ చేయడంలేదు. ఇంకా యాక్టింగ్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే నెలకు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నెట్‌‌‌‌వర్త్‌‌‌‌ 20 కోట్ల రూపాయలు. 

ఫ్రొఫైల్‌‌

పుట్టింది: ఢిల్లీ
ప్రస్తుతం ఉంటోంది: ఢిల్లీ
స్కూల్‌‌: మహరాజ అగ్రసేన్‌‌ స్కూల్‌‌
కాలేజ్‌‌: శ్రీ అరబిందో కాలేజ్‌‌
క్వాలిఫికేషన్‌‌: బ్యాచ్‌‌లర్స్‌‌ ఆఫ్​ కంప్యూటర్‌‌‌‌ అప్లికేషన్స్‌‌(సెకండియర్‌‌‌‌ డ్రాపవుట్‌‌)
అవార్డ్స్‌‌: సిల్వర్‌‌‌‌ క్రియేటర్‌‌‌‌, గోల్డ్ క్రియేటర్‌‌‌‌
నచ్చిన యాక్టర్‌‌‌‌: సల్మాన్‌‌ ఖాన్‌‌
నచ్చిన నటి: కరిష్మా కపూర్‌‌‌‌
నచ్చిన ఫిలిం మేకర్‌‌‌‌: కరణ్​ జోహార్‌‌‌‌
నచ్చిన ఆట: క్రికెట్