ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి లైంగిక ఆరోపనలు ఎద్కొంటున్న విషయం తెలిసిందే. ఓ యువతి తనును ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అతనిపై పలు సెషన్లపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో హైకోర్టులో హర్షసాయి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 22న (నేడు) తెలంగాణ హైకోర్ట్ బెయిల్ పిటిషన్ విచారించింది. హర్షసాయి తండ్రిపై కూడా సదరు యువతి ఫిర్యాదు చేసింది. కాగా తదుపరి విచారణ ఈనెల 25 కు హైకోర్టు వాయిదా వేసింది.