శంషాబాద్, వెలుగు: కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన యూట్యూబర్ హర్షసాయి సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. ఒక చిన్న పని మీద విదేశాలకు వెళ్లానని, అది పూర్తి చేసుకొని తిరిగి వచ్చినట్లు చెప్పారు.
తన మీద వచ్చిన ఆరోపణలు అసత్యం కాబట్టే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. త్వరలో తన సినిమాను రిలీజ్ చేస్తానని మీడియాకు చెప్పారు.