విచారణకు పోవాల్సిందే: హైకోర్టులో యూట్యూబర్ ఇమ్రాన్‎కు బిగ్ షాక్

విచారణకు పోవాల్సిందే: హైకోర్టులో యూట్యూబర్ ఇమ్రాన్‎కు బిగ్ షాక్

హైదరాబాద్: రాష్ట్ర సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యూట్యూబర్ ఇమ్రాన్‎కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎఫ్ఆర్ క్వాష్ చేసేందుకు, దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని ఇమ్రాన్‎ను ఆదేశించింది. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడన్న ఆరోపణలపై యూట్యూబర్ ఇమ్రాన్‎పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. త్వరలోనే నోటీసులు విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్ ఇమ్రాన్‎ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో విషాదం

అలాగే.. పోలీసులు ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా స్టే ఇవ్వాలని కోరాడు. ఇమ్రాన్ పిటిషన్‎పై గురువారం (మార్చి 27) విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎఫ్ఆర్ క్వాష్ చేసేందుకు నిరాకరించింది. అలాగే.. విచారణపై స్టే విధించాలన్న ఇమ్రాన్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇమ్రాన్‎కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. 

కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‎పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న సినీ సెలబ్రెటీలు, యూట్యూబర్లు, ఇన్‎ప్లూయెన్సర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, ప్రభాస్, మంచు లక్ష్మి, విష్ణు ప్రియ, నిధి అగర్వాల్, యాంకర్ శ్యామల, సుప్రియ, రీతు చౌదరి, టెస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్‎తో పాటు పలువురిపై కేసులు ఫైల్ చేశారు. ఇందులో ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించారు. మరికొందరికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.