యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పై NDPS కేసు నమోదైంది. తండ్రి కూతురు బంధంపై అసభ్య కామెంట్స్ చేసిన ప్రణీత్ హనుమంత్ ను కొన్ని రోజుల కిందట అరెస్టు చేశారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. ప్రణీత్ ను ఎంకైరీ చేసిన పోలీసులు అతనికి కొన్ని మెడికల్ టెస్టులు చేయించారు. అందులో ప్రణీత్ హనుమంతు మత్తు పదార్థాలు సేవించినట్టు గుర్తించారు.
గంజాయి సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ లో వచ్చింది. దీంతో సైబర్ సెక్యూరిటీ పోలీసులు NDPS సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రణీత్ పై పోక్సో తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం చంచల్ గూడ జైలు లో ఉన్నారు. మూడు రోజుల పాటు కష్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read:-కేరళ, కర్ణాటకలో భారీవర్షాలు..స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ప్రణీత్ హనుమంతును శిక్షించాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆరోజు అతను మాట్లాడిన మాటలు తండ్రీకూతుళ్ల సంబంధానికి మచ్చ తెచ్చి పెట్టాయాని ఫైర్ అవుతున్నారు.