నట్టింట్లో ప్రియుడితో యవ్వారం.. భర్త చూసేయడంతో భార్య చేసిందీ ఘోరం

నట్టింట్లో ప్రియుడితో యవ్వారం.. భర్త చూసేయడంతో భార్య చేసిందీ ఘోరం

న్యూఢిల్లీ: హర్యానాలోని హిస్సార్లో దారుణం జరిగింది. ప్రియుడితో శృంగారం చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన వ్యక్తి కోసం ఇంట్లో మనిషిని చంపేసింది. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్లోని ప్రేమ్ నగర్లో జరిగింది. 

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని రెవారీ జిల్లా జూడీ గ్రామానికి చెందిన రవీన, భీవానీ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ 2017లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఆరేళ్ల బాబు కూడా ఉన్నాడు. ప్రవీణ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. రవీనా స్మార్ట్ ఫోన్ను ఎక్కువగా వాడుతుంటుంది. సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు, రీల్స్ చేయడం అంటే రవీనాకు ఎంతో ఆసక్తి. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి.

Also Read:-కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు

ఈ క్రమంలోనే.. ఏడాదిన్నర క్రితం రవీనాకు ఇన్ స్టాగ్రాంలో సురేష్ అనే ఒక యూట్యూబర్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా కొన్ని నెలలకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి యూట్యూబ్లో షార్ట్స్ చేశారు. మార్చి 25న రవీనా, ఆమె ప్రియుడు.. రవీనా ఇంట్లోనే శృంగారం చేస్తూ ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. ప్రవీణ్ ఉండగా తమ కామకలాపాలు సాగవని భావించిన రవీనా, ఆమె ప్రియుడు సురేష్.. ప్రవీణ్ను చంపాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు రాత్రి భర్త హత్యకు రవీనా వ్యూహ రచన చేసింది.

ప్రవీణ్ ఇంట్లో నిద్రిస్తుండగా.. ప్రియుడి సాయంతో చున్నీతో ఉరి బిగించి రవీనా తన భర్తను హత్య చేసింది. అర్ధరాత్రి సమయంలో స్థానికులు అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రవీణ్ మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని సురేష్, రవీనా ఆరు కిలోమీటర్ల అవతల డ్రైనేజ్లో పడేశారు. సురేష్ కానరాకపోవడంతో అతని గురించి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరా తీశారు. రవీనాను అడగ్గా ఎక్కడకు వెళ్లాడో తనకేం తెలియదని బుకాయించింది. ఆమెపై అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా రవీనా, ఆమె ప్రియుడు చేసిన ఘోరం బయటపడింది. ప్రవీణ్ డెడ్ బాడీతో వీళ్లిద్దరూ బైక్ పై అర్ధరాత్రి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వెళ్లే సమయంలో వీళ్లిద్దరి మధ్యలో కనిపించిన ప్రవీణ్.. రెండు గంటల తర్వాత ఇద్దరే తిరిగి రావడాన్ని పోలీసులు సీసీ ఫుటేజీలో గమనించారు. ప్రవీణ్ ను చంపి మాయం చేసిందని రవీనా, ఆమె ప్రియుడేనని తేల్చారు. మార్చి 28న ప్రవీణ్ డెడ్ బాడీ లభ్యమైంది. పోలీసులు రవీనా, ఆమె ప్రియుడు సురేష్ పై హత్య కేసు నమోదు చేశారు.