తమిళనాడులోని కాంచీపురం సమీపంలో జరిగిన బైక్ స్టంట్‌లో యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ గాయపడ్డారు. యూట్యూబర్ కాంచీపురం చెన్నై-బెంగళూరు హైవేలోని సర్వీస్ రోడ్డు వద్ద బైక్ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బైక్ స్టంట్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడిపోయారు.
BREAKING: Popular YouTuber #TTFVasan met with an accident. pic.twitter.com/3UEuasmnFg
— Manobala Vijayabalan (@ManobalaV) September 17, 2023
ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. వాసన్ చేతికి గాయమవగా ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వాసన్‌పై తమిళనాడు పోలీసులు ఇటీవల ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు.
టీటీఎఫ్ వాసన్ ఓవర్ స్పీడ్ కారణంగా వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచాడు. కోయంబత్తూరుకు చెందిన వాసన్ .. ట్విన్ థ్రోట్లర్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. కొత్త బైక్స్ కు సంబంధించిన విశేషాలు, వాటి టెస్ట్ రైడ్, బైక్‌పై విహార యాత్రలు.. ఇలా ఎక్కువగా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.