యూట్యూబర్​ : తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ట్రావెలింగ్​ ఎలా చేయాలి?..ఇండియన్​ ట్రావెల్ యూట్యూబర్ పూర్తి వివరాలు

యూట్యూబర్​ : తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ట్రావెలింగ్​ ఎలా చేయాలి?..ఇండియన్​ ట్రావెల్ యూట్యూబర్ పూర్తి వివరాలు

తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ట్రావెలింగ్​ ఎలా చేయాలి? అనే ప్రశ్నకు సమాధానం వరుణ్ వాగీష్ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. వరుణ్​ పది లక్షల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్‌‌‌‌‌‌‌‌ల మార్కును దాటిన మొదటి ఇండియన్​ ట్రావెల్ యూట్యూబర్​. పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడం, దేశ, విదేశాల్లో ఉన్న ట్రావెలింగ్​ డెస్టినేషన్స్​ని ఎక్స్​ప్లోర్​ చేయడంతోపాటు అక్కడి కల్చర్​ని అందరికీ పరిచయం చేస్తుంటాడు​. కొన్నేళ్ల క్రితం 3 వేల రూపాయలతో ఎనిమిది రోజుల పాటు మలేసియాలో ట్రావెల్​ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 

వరుణ్ ఢిల్లీలో పుట్టాడు. చదువు కోసం చాలా రాష్ట్రాలు తిరిగాడు. ఎక్కువకాలం మహారాష్ట్రలో చదువుకున్నాడు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో కూడా కొంత కాలం ఉన్నాడు. చిన్నప్పటినుంచే వరుణ్​కి ట్రావెలింగ్​, ట్రెక్కింగ్​ అంటే ఇష్టం. అందుకే స్కూల్​కు బంక్ కొట్టి దగ్గర్లోని చూడదగిన ప్లేస్​లు​, పర్వతాలను ఎక్స్​ప్లోర్​ చేసేవాడు. ఆ తర్వాత పై చదువుల కోసం మళ్లీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో పర్వతాలు ఎక్కాలనే ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌ మరీ ఎక్కువైంది. అందుకే వీలైనప్పుడల్లా హిమాలయాలకు వెళ్లేవాడు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లి, అక్కడివాళ్లతో సరదాగా గడిపేవాడు వరుణ్​.

ట్రావెలింగ్​లోకి.. 

వరుణ్ న్యూఢిల్లీలోని ఐఐఎంసిలో చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత జర్నలిజంలో తన కెరీర్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టాడు.  మాస్ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌లో ఎంఫిల్, పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ కూడా చేశాడు. జర్నలిజం ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌లో లెక్చరర్​గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత పబ్లిక్​ రిలేషన్స్​(పీఆర్​వో​) డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్​లో ఉద్యోగం సాధించాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ, కేంద్ర మంత్రుల పీఆర్ ఆఫీసర్​​గా కూడా పనిచేశాడు. 15 ఏళ్లు పనిచేసిన తర్వాత అతనికి నచ్చిన ట్రెక్కింగ్​, ట్రావెలింగ్​ని మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది. దాంతో అన్నీ పక్కకు పెట్టి 2017లో ఫుల్ టైమ్ ట్రావెలింగ్​ యూట్యూబర్‌‌‌‌‌‌‌‌గా మారిపోయాడు.

3 వేలతో మలేసియాకు..  

మౌంటెన్​ ట్రెక్కర్​ ఛానెల్​లో థాయిలాండ్, మలేసియా ట్రావెల్ సిరీస్ చాలా పాపులర్​ అయ్యింది. ఈ సిరీస్​ని చాలామంది చూశారు. వరుణ్ కేవలం 6,000 రూపాయలతో థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌లో, 3,000 రూపాయలతో మలేషియాలో ట్రావెల్​ చేశాడు. అంతేకాదు.. 10,000 రూపాయల బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో యూరప్‌‌‌‌‌‌‌‌లోని మూడు దేశాల్లో 15 రోజుల పాటు ట్రావెల్​ చేసి చూపించాడు. ఇప్పటివరకు రష్యా, అమెరికా, కెనడాతో సహా ఎన్నో దేశాలు వెళ్లి ట్రావెల్ సిరీస్‌‌‌‌‌‌‌‌లు చేశాడు. 

తన వ్లాగ్స్​లో ప్రయాణ ఖర్చులు, వీసా ఎలా తీసుకోవాలి? అనే విషయాలపై చిట్కాలు, ట్రిక్‌‌‌‌‌‌‌‌లు కూడా చెప్తుంటాడు. గూగుల్​లో కూడా కనిపించని ఆఫ్ బీట్, నాన్–టూరిస్టిక్ ప్లేస్​లను అందరికీ పరిచయం చేస్తుంటాడు. మన దేశంలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు వెళ్లాడు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించినందుకు గాను భారత పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు కూడా అందుకున్నాడు వరుణ్​.

యూట్యూబ్​లోకి.. 

వాస్తవానికి వరుణ్​ 2007 ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లోనే ‘మౌంటెన్ ట్రెక్కర్’ పేరుతో యూట్యూబ్​ చానెల్​ పెట్టాడు. అతనికి పర్వతాలు ఎక్కడమంటే చాలా ఇష్టం. అందుకే ఆ పేరు పెట్టాడు. 2017 నుంచి రెగ్యులర్​గా వీడియోలు చేస్తున్నాడు. అప్పటినుంచి సరిగ్గా మూడేళ్లలోనే సబ్​స్క్రయిబర్ల సంఖ్య10 లక్షలు దాటింది. అతని వీడియోలు కుటుంబంతో కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి. అలాంటి కంటెంట్​ని మాత్రమే పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. అందరికీ అర్థమయ్యేలా సరళమైన హిందీలో మాట్లాడతాడు. ప్రత్యేకంగా తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఎలా ట్రావెలింగ్​ చేయాలో చెప్తుంటాడు. ‘‘అసలు ట్రావెలింగ్​కి పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ఆ విషయాన్ని మనవాళ్లందరికీ చెప్పేందుకే ఈ చానెల్ స్టార్ట్ చేశా’’నని వరుణ్​ అంటున్నాడు. 

వాలంటరింగ్

విదేశాలకు వెళ్లినప్పుడు వాలంటరింగ్​, కౌచ్​ సర్ఫింగ్, హిచ్‌‌‌‌‌‌‌‌హైకింగ్.. లాంటి సర్వీసులతో వరుణ్​ చాలా ఖర్చులను తగ్గించుకుంటున్నాడు. కౌచ్​ సర్ఫింగ్​ ద్వారా అక్కడివాళ్ల ఇండ్లలో ఉండేందుకు షెల్టర్​ దొరుకుతుంది. హిచ్​ హైకింగ్​ వల్ల ఒక ప్లేస్​ నుంచి మరో ప్లేస్​కి వెళ్లడానికి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ దొరుకుతుంది. వీటివల్ల అక్కడివాళ్లతో కనెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశం.. విభిన్న సంస్కృతులు, జీవనశైలి, వంటకాల గురించి తెలుసుకునే వీలు దొరుకుతుంది. వాలంటీర్​గా పనిచేయడం వల్ల కొత్త స్కిల్స్​ని నేర్చుకుంటున్నాడు. 

ఉదాహరణకు, అమెరికాలోని ఒక మారుమూల ప్రదేశానికి వెళ్లినప్పుడు వరుణ్​ చాలా భూమి ఉన్న ఒక పెద్దాయన దగ్గర వలంటీర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశాడు. అక్కడ చెక్క ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, సిమెంట్ ప్యానెళ్లను ఎలా వేయాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత అదే పనిని తన హోస్ట్ కోసం చేశాడు. ‘హిచ్‌‌‌‌‌‌‌‌హైకింగ్‌‌‌‌‌‌‌‌ వల్ల నేను  చాలాసార్లు గంటల తరబడి వెయిట్​ చేయాల్సి వచ్చింది. దానివల్ల జీవితానికి ఎంతో  అవసరమైన సహన గుణాన్ని అలవాటు చేసుకున్నా” అంటున్నాడు వరుణ్​.