యూట్యూబ్ రిపోర్టర్లం అంటూ వాహనాల తనిఖీ.. ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు!!

కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూట్యూట్ రిపోర్టర్లమని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తులు వాహనాలను తనిఖీ చేశారు. ఓ డీసీఎం వ్యానులో తెచ్చిన బియ్యాన్ని సీజ్ చేస్తామంటూ యజమానిని బెదిరించారు. ప్రధానమైన నాలుగు ఛానళ్లు తమవే అన్నారు. డీసీఎం వ్యాన్ ను విడిచిపెట్టాలంటే  రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే డీసీఎం వ్యాన్ ను సీజ్ చేస్తామని హంగామా చేశారు. 

సివిల్ సప్లై అధికారుల పేరు చెప్పి.. పోలీసులకు ఫోన్ చేశారు. ఇది గమనించిన డీసీఎం సిబ్బంది ఐడీ కార్డులు చూపించాలంటూ రిపోర్టర్లను నిలదీశారు. వారి దగ్గర ఐడీ కార్డులు లేకపోవడం గుర్తించి చితకబాదారు. డబ్బుల కోసం తమను బెదిరించారని.. ఫేక్ రిపోర్టర్ల పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.