బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులకు భయపడి.. దుబాయ్‌‌కి పారిపోయిన హర్షసాయి, ఇమ్రాన్​ఖాన్! ​

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులకు భయపడి..  దుబాయ్‌‌కి పారిపోయిన హర్షసాయి, ఇమ్రాన్​ఖాన్! ​

బెట్టింగ్ యాప్స్ ఉదంతం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది.. యూట్యూబర్స్ తో మొదలైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల పరంపర టాలీవుడ్ స్టార్స్ వరకు చేరింది. టాలీవుడ్ స్టార్లు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ సహా 25 మంది యూట్యూబర్స్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గురువారం ( మార్చి 20 ) యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. యూట్యూబర్లు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. 

దుబాయ్‌‌కి పారిపోయిన హర్షసాయి, ఇమ్రాన్​ఖాన్! ​ 

బెట్టింగ్ యాప్స్‌‌ ప్రమోషన్స్‌‌ విషయంలో పంజా గుట్ట పోలీస్​స్టేషన్‌‌లో11 మందిపై కేసులు నమోదు కాగా.. వీరిలో హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్​ దుబాయ్ లేదా బ్యాంకాక్ పారిపోయినట్టు  పోలీసులు అనుమానిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా వీరు విచారణకు రాకపోవడంతో వీరిద్దరూ ఎక్కడున్నారని పోలీసులు నిఘా పెట్టినట్టు తెలిసింది.  

Also Read:-దేశంలో సగం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. నటి శ్యామల, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులిచ్చారు. వీరి విచారణ తర్వాత మిగతా వారికి సైతం నోటీసులు ఇవ్వనున్నారు. కాగా, నోటీసులకు స్పందించకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.