అవినీతిపై ప్రశ్నించిన యూట్యూబర్.. ఇంటిపై దాడికి దిగిన పారిశుధ్య కార్మికులు..

అవినీతిపై ప్రశ్నించిన యూట్యూబర్.. ఇంటిపై దాడికి దిగిన పారిశుధ్య కార్మికులు..

అవినీతిని ప్రశ్నించినందుకు ఓ యూట్యూబర్ ఇంటిపై దాడి చేశారు దుండగులు.యూట్యూబర్ ఇంటికి పారిశుధ్య కార్మికుల వేషంలో వచ్చిన 20మంది దుండగులు..  ఇంట్లో మనుషుల మలంతో నిండిన డ్రైనేజి నీళ్లు పోసి..ఇప్పటికి దీంతో సరిపెడుతున్నాం.. నెక్స్ట్ టైం ఇంటిని తగలబెట్టేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ( మార్చి 25 ) చెన్నైలోని కీల్పాక్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన.. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 

రాజకీయ అంశాలు, సామజిక అంశాలపై విమర్శనాత్మకంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు యూట్యూబర్ సవుక్కు శంకర్. ఈ క్రమంలో మురుగునీటి ట్రక్కుల సేకరణలో జరిగిన అవినీతిని ప్రశ్నించారు శంకర్. దీంతో ఆగ్రహించిన పారిశుధ్య కార్మికులు శంకర్ ఇంటిపై దాడి చేశారు. 20మంది పారిశుధ్య కార్మికులు తమ ఇంటిపై దాడి చేశారని.. మనుషుల మలంతో నిండిన డ్రైనేజి నీళ్లను తెచ్చిఇంట్లో పోశారని శంకర్ తల్లి తెలిపింది. ఈసారికి దీంతో సరిపెడుతున్నామని.. నెక్స్ట్ టైం ఇంటిని తగలపెడతామని బెదిరించారని తెలిపారు శంకర్ తల్లి. దాడి జరిగిన సమయంలో శంకర్ ఇంట్లో లేరని తెలిపింది. 

చెన్నై పోలీస్ కమిషనర్ ఎ. అరుణ్ ఆదేశాల మేరకే దాడి జరిగిందని శంకర్ ఆరోపించారు. తన ఇంటిపై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా రిలీజ్ చేశారు శంకర్. కాగా.. ఈ ఘటనపై సీబీసీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు. అయితే .. చెన్నై పోలీసులపై తనకు నమ్మకం లేదని.. దర్యాప్తును వేరే సంస్థకు అప్పగించాలని కోరుతున్నారు శంకర్.