
బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్,యూట్యూబర్ టేస్టీ తేజ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మార్చి 18న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసులు టేస్టీ తేజను విచారిస్తున్నారు. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్, నగదు లావాదేవీల గురించి ఆరదాదీస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే 11 మంది యంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా టేస్టీ తేజ, విష్ణుప్రియను మార్చి 18న విచారణకు హాజరుకావాాలంటూ ఆదేశించారు. అయితే విష్ణు ప్రియ డుమ్మ కొట్టగా..టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు.
ALSO READ | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి ఈడీ..!
మరో వైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చేరినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుని బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై ఈడీ విచారిస్తోన్నట్లు తెలిసింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్ లపై గేమింగ్ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.