సీఎం జగన్ తరఫున పులివెందులలో ఎన్నికల ప్రచారంనిర్వహిస్తున్న వైఎస్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో జగన్ కు లక్ష మెజారిటీ రావటం ఖాయమనియూ అన్నారు.ఎంపీ అవినాష్ భార్య సునీతతో కలిసి ప్రచారంలో పాల్గొన్న భారతి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.వైఎస్ కుటుంబానికి పులివెందుల బలమని అన్నారు.నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీని పులివెందుల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు.
జగన్ చెప్పారంటే చేస్తారంతే అన్న నమ్మకం ప్రజల్లో కూడా ఉందని అన్నారు భారతి. కాగా, శనివారం జగన్ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న పథకాలకే నగదు పెంచుతూ 2024 ఎన్నికల మేనిఫెస్టో రూపొందించింది వైసీపీ. సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తానని, చేయలేనివి చేస్తానని చెప్పి చంద్రబాబులా తాను మోసం చేయనని అంటున్నారు జగన్. మరి, భారతి అన్నట్టుగా ఈసారి పులివెందులలో జగన్ లక్ష మెజారిటీతో గెలుస్తారా లేదా చూడాలి.