సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఏప్రిల్ 25న పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటిదాకా నిర్వహించిన సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ అవ్వటంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ నెల 28 నుండి జగన్ మలివిడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మరో వార్త వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది.
జగన్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న నేపథ్యంలో పులివెందులలో ప్రచార బాధ్యతలు జగన్ సతీమణి వైఎస్ భారతి తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. స్థానిక వైసీపీ నేతలతో కలిసి భారతి ప్రచారం నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. 2014, 2019ఎన్నికల్లో కూడా జగన్ తరఫున భారతి పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భారతితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.