ఒకే వేదికపై జగన్, షర్మిల..! ఎప్పుడంటే..?

ఒకే వేదికపై జగన్, షర్మిల..! ఎప్పుడంటే..?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఒకే వేదికపైకి రానున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆయన ఓటమికి షర్మిల కారణమైందని చాలా మంది అబిప్రాయపడుతున్న నేపథ్యంలో.. జగన్, షర్మిల ఒకే వేదిక మీద కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జులై 8న వైఎస్సార్ 75వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయ రానున్నారు జగన్, షర్మిల. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన అన్నా చెల్లెల్లు చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలవనున్నారని వార్తలొస్తున్న క్రమంలో  రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసులో జగన్, అవినాష్ రెడ్డిలపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయటం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఎన్నికల తర్వాత షర్మిల సైలెంట్ అయ్యింది.వివేకా హత్య కేసు ప్రస్తావన కానీ, జగన్ పై విమర్శలు కానీ చెయ్యట్లేదు.దీంతో జూలై 8న ఇడుపులపాయలో ఇద్దరు కలిసి వైఎస్ కు నివాళులు అర్పిస్తారా లేదా అన్న అంశంపై చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా, జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్బంగా విజయవాడలో జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ ఉత్సవాలకు వైఎస్ విజయమ్మ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా హాజరు కానున్నారు.ఇక జగన్ మాత్రం ఆ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఇడుపులపాయలోని గడపనున్నారు. మరి, జగన్ షర్మిల కలిసి తండ్రికి నివాళులు అర్పిస్తారా లేక విడివిడిగా ప్లాన్ చేస్తారా అన్నది వేచి చూడాలి.