![ఇడుపుల పాయలో వైఎస్సార్ కు జగన్, షర్మిల నివాళి](https://static.v6velugu.com/uploads/2024/07/ys-jagan-and-ys-sharmila-pays-tribute-to-dr-ysr-on-his-birth-anniversary-at-idupulapaya_O3CtKRfBxA.jpg)
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి అంజలి ఘటించారు. సమాధిపై పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు జగన్. తల్లి విజయమ్మ ఈ సందర్బంగా జగన్ ను ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్ వెంట వైసీపీ ఎంపీలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరో వైపు కుటుంబంతో ఇడుపులపాయకు వచ్చారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. తల్లి విజయమ్మ భర్త అనిల్, కొడుకు రాజారెడ్డి,కోడలు, కూతురితో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి ప్రార్థనలు చేశారు.