
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ కుటుంబంపై దాడిని ఖండించారు వైసీపీ అధినేత జగన్.ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ గారి కుటుంబంపై దాడి బాధాకరమన్నారు జగన్. రంగరాజన్ ను ఫోన్లో పరామర్శించిన జగన్ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. రంగరాజన్ పై దాడి ఘటన వివరాలు ఆరా తీసిన జగన్ ఆయన యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు.
ఫిబ్రవరి 9న రంగరాజన్ పై జరిగిన దాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీర రాఘవరెడ్డి గ్యాంగ్ ఆయనపై దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డితోపాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read : శివాలయంలో శివ భక్తులకు.. ముస్లిం సోదరుడి అన్నప్రసాదం
అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీర రాఘవ రెడ్డి.. తనకు చందా ఇవ్వాలని.. ఆర్మీకి సపోర్ట్ చేయాలని రంగరాజన్ పై ఒత్తిడి తెచ్చారు. అందుకు రంగరాజన్ నిరాకరించగా దాడికి పాల్పడ్డారు వీర రాఘవరెడ్డి గ్యాంగ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ఈ ఘటన. రాజకీయ ప్రముఖులు, హిందూ ధార్మిక సంస్థలు రంగరాజన్ కు మద్దతుగా నిలిచాయి.