ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదు: జగన్

ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదు: జగన్

అసెంబ్లీకి హాజరుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు జగన్. మాట్లాడటానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది.. ఎమ్మెల్యేకు ఇచ్చినంత టైం ఇస్తానంటే ఎలా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం ఇష్టం లేకనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అన్నారు. రాష్ట్ర అప్పులపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జగన్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 నెలల తర్వాత బాబు  షూరిటీ మోసం గ్యారంటీగా మారిందని ఎద్దేవా చేశారు. 

ALSO READ | మద్యం కుంభకోణం పై సిట్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

బటన్ నొక్కడం పెద్ద పనా అని మాట్లాడారని.. ముసలోళ్ళు కూడా బటన్ నొక్కుతారని తమపై విమర్శలు చేశారని అన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని.. నీకు రూ. 15వేలు నీకు రూ. 15వేలు అంటూ ప్రచారం చేసి మోసం చేశారని అన్నారు జగన్. హామీలపై బాండ్లు కూడా ఇచ్చారని.. అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నారని.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు జగన్. 

అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డ్ బద్దలు కొట్టిందని.. 9 నెలల్లోనే రూ. 80వేల కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. అమరావతి పేరుతో రూ. 52వేల కోట్లు అప్పు చేశారని.. చేసిన అప్పు అంతా ఎవరి జేబుల్లోకి వెళుతోందని ప్రశ్నించారు జగన్.