చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారట.. అందుకే అంత కోపం.. వైఎస్ జగన్

వైసీపీ ప్రభుత్వ హయాంలో అవకతవకలపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలు కౌంటర్ గా వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు కౌంటర్ ఇచ్చారు జగన్. ఇదిలా ఉండగా, చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు క్లాస్మేట్స్ అని, అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని అన్నారు. అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే అంత కోపమని అన్నారు.

ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పటికీ పెద్దిరెడ్డిపై కక్షతో రగిలిపోతున్నారని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేసి, ఆయనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారని అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.