చంద్రబాబు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు: జగన్

చంద్రబాబు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు: జగన్

ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పై స్పందించిన వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేసారని, అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అన్నట్లు పరిస్థితి తయారయ్యిందని ఎద్దేవా చేశారు జగన్. ఎన్నికలకు నిరుద్యోగ భృతి ఇస్తా, ఉద్యోగాలు కల్పిస్తా అని హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారని మండిపడ్డారు జగన్.

కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారని.. రెండు బుడ్జెట్లలోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగా బడ్జెట్ ప్రసంగం ఉందని అన్నారు జగన్. హామీల గురించి అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని.. మొదటి బడ్జెట్లో  కేటాయించింది బోడి సున్నా అని.. రెండో బడ్జెట్లో కూడా అరకొర కేటాయింపులే చేశారని అన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారు, రూ. 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు కానీ..  నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు.

Also Read : జగన్కు ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక ప్రకటన

ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు కేటాయించామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు కానీ.. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారని అన్నారు. తమ హయాంలో 4 నెలల్లోనే లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు జగన్.