టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను గుంటూరు జైలుకు వెళ్లి కలిశారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. విజయవాడ వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగామ సురేష్ ను అరెస్ట్ చేశారని అన్నారు.
వరదల్లో 60మంది చనిపోవటం ముమ్మాటికీ సీఎం వైఫల్యమే అని అన్నారు. నాలుగు నెలల్లో చంద్రబాబు పాలనను గాలికి వదిలేశారని అన్నారు. తుఫాను వస్తుందని నాలుగురోజుల ముందే హెచ్చరించినా సీఎం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు.
Also Read:-పాస్ పోర్టు ఇష్యూలో సీఎం జగన్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
వైసీపీ కార్యకర్తలు దాడులు, నాయకుల అక్రమ అరెస్టులతో తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారని అన్నారు. తప్పుడు సంప్రదాయం సునామీలా వస్తుందని, ఆరోజు జైల్లో మీవాళ్లంతా ఉంటారని హెచ్చరించారు. రెడ్ బుక్ మీకే సొంతం అనుకోవద్దని అన్నారు. చంద్రబాబు తన ఇంటిని రక్షించుకునేందుకే బుడమేరు గేట్లు ఎత్తాడని, అలర్ట్ ఇవ్వకుండా గేట్లు ఎత్తి విజయవాడకు నీళ్లు వదిలారని అన్నారు. ఈ ఘటనలో చంద్రబాబు మీద కేసు పెట్టొచ్చని అన్నారు.