డ్రగ్ మాఫియా డాన్ తో పోల్చిన చంద్రబాబు.. కౌంటర్ ఇచ్చిన జగన్..

ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య శ్వేతపత్రాల వార్ నడుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు శ్వేతపత్రాలకు కౌంటర్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జగన్ ను కొలంబియన్ డ్రగ్ మాఫియా డాన్ తో పోల్చాడు చంద్రబాబు. ఈ అంశంపై జగన్ ను మీడియా ప్రశ్నించగా తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు జగన్.

Also Read:-రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు

చంద్రబాబు పోల్చిన సదరు డ్రగ్ మాఫియా డాన్ పేరు కూడా తనకు తెలీదని, పదే పదే చంద్రబాబు అతని పేరు కలవరపోతున్నాడంటే  చంద్రబాబుకు ఆ మాఫియా డాన్ స్నేహితుడేమో అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తాను గళమెత్తుతానన్న భయంతోనే చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అన్నారు  జగన్.