కార్యకర్తలకు హ్యాట్సాఫ్: స్థానిక సంస్థల ఉపఎన్నికలపై జగన్ ఎమోషనల్ ట్వీట్..

కార్యకర్తలకు హ్యాట్సాఫ్: స్థానిక సంస్థల ఉపఎన్నికలపై జగన్ ఎమోషనల్ ట్వీట్..

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందిన సంగతి తెలిసిందే.. ఈ విజయంపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. పార్టీకి ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు జగన్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.

పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా.. కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా.. ఎన్ని ప్రలోభాలు పెట్టినా  వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని అన్నారు జగన్.

ALSO READ : ఏపీ జల దోపిడీ ఆగట్లే!..సాగర్ నుంచి రోజుకు సగటున 7 వేల క్యూసెక్కులు మళ్లింపు

 

 

విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నానని... క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నానని అన్నారు జగన్.