
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటుగా టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్‌లో డ్యాన్స్‌లు చేసేవాడు ఒకడైతే, అమ్మాయిలు కనిపిస్తే కడుపు చేసేయాలని చెప్పేవాడు మరొకడు..టీవీ షోకి వెళ్లి.. బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను అంటాడు మరొకడు. చేసిన తప్పుడు పనులను గొప్పగా చెప్పుకునే ముసలాయన మరొకడు. నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్.. వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతున్నాడు. ఇలా క్యారెక్టర్ లేని వాళ్లంతా వాలంటీర్ల వ్యవస్థ మీద మాట్లాడటం దౌర్భాగ్యం అంటూ జగన్ సెటైర్లు వేశారు.
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సభలో జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తు్న్నట్లుగా సీఎం జగన్ తెలిపారు. మేనిఫెస్టోలో 90 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. చుక్కల భూముల సమస్యల్ని పరిష్కరించి రైతన్నల కష్టాలు తొలిగించిన ఘనత వైసీపీది అన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు కడుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీపై దారుణంగా అబద్ధాలు చెబుతారని అవేమీ నమ్మోద్దని ప్రజలను కోరారు.