వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ...

2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న జగన్, ఇప్పుడిప్పుడే ఓటమి నుండి బయటికొస్తున్నారు. గురువారం నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి పరామర్శించిన జగన్... శుక్రవారం ( జూలై 5, 2024 ) నాడు వైసీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు నేతలు ఉన్నారు.

వైసీపీ నుండి వలసలు ఉంటాయంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.వెళ్లేవాళ్లు వెళ్ళండి.. ఎవరూ ఆపారు అంటూ జగన్ కూడా రీసెంట్ గా కామెంట్ చేసిన క్రమంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో జగన్ భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.టీడీపీ శ్రేణుల దాడులపై వ్యవహరించాల్సిన తీరు వంటి కీలక అంశాలు ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.