చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్​ను .. ఫోన్​లో పరామర్శించిన జగన్‌‌

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్​ను .. ఫోన్​లో పరామర్శించిన జగన్‌‌

హైదరాబాద్, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ను వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్. జగన్ బుధవారం ఫోన్ లో పరామర్శించారు. వైసీపీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డికి వైఎస్. జగన్ ఫోన్ చేయగా.. ఆయన రంగరాజన్‌‌తో మాట్లాడించారు. 

ఈ సందర్భంగా దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యోగక్షేమాలు గురించి ఆరా తీశారు. రంగరాజన్ కుటుంబంపై దాడి చేయడం బాధాకరమని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌ మండల పరిధిలోని చిలుకూరు బాలజీ ఆలయం సమీపంలోని రంగరాజన్‌‌ నివాసానికి వచ్చిన పలువురు రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలంటూ ఆయనపై దాడికి పాల్పడ్డారు.