జగనన్న 2.O వేరుగా ఉంటుంది.. కార్యకర్తల కోసమే : జగన్

జగనన్న 2.O వేరుగా ఉంటుంది.. కార్యకర్తల కోసమే : జగన్

"జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు".. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత సామాన్యుల నుండి పార్టీ నేతల వరకు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.. సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు కాబట్టే ఈ రేంజ్ లో ఓటమి చవిచూశాడని పలువురు పార్టీ నేతలు బహిరంగంగానే అన్నారు. ఆలస్యంగా అయినా ఈ మాటలు జగన్ దాకా చేరినట్లున్నాయి.. ప్రజలు.. ప్రజలు అంటూ జపం చేసిన జగన్, ఇప్పుడు కార్యకర్తలే తన ప్రయారిటీ అని తేల్చి చెప్పేశాడు. బుధవారం ( ఫిబ్రవరి 5, 2025 ) విజయవాడలో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్.

వైసీపీ బతుకుందని.. రాష్ట్రాన్ని మరో 30ఏళ్ళు ఏలుతుందని అన్నారు జగన్. ఈసారి జగన్ 2.0 వేరుగా ఉంటుందని.. కార్యకర్త కోసమే పనిచేస్తానని అన్నారు. ఎవ్వరు కూడా వైసీపీ వైసీపీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. జగన్ 1.0లో కార్యకర్తలకు గొప్పగా చేసిందేమీ లేదని..ప్రతి విషయంలో ప్రజల కోసమే సమయం కేటాయించానని.. ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు జగన్.

Also Read : తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు

జగన్ 2.0లో కార్యకర్తల కష్టాలేంటో చూశానని.. చంద్రబాబు కార్యాకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశానని అన్నారు. కార్యకర్తలకు ఏం కావాలో తెలుసుకున్నానని.. ఇక కార్యకర్తల కోసమే జగన్ గట్టిగా నిలబడతాడని అన్నారు. జగన్ మాటలు వైసీపీ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామాతో కాస్త ఢీలా పడ్డ వైసీపీ కార్యకర్తల్లో జగన్ స్పీచ్ ధైర్యాన్ని నింపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.త్వరలోనే జిల్లాల పర్యటన ఉన్న క్రమంలో తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్ కి బలం చేకూర్చాయనే చెప్పాలి.