
సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగమయ్య హత్య రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందని.. రాష్ట్రంలో ఒకప్పటి బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని అన్నారు జగన్. 50 చోట్ల ఎంపీపీ ఎన్నికలు జరిగితే.. 39 చోట్ల వైసీపీ గెలిచిందని.. టీడీపీకి బలం లేకున్నా గెలవాలని చూసి 7 చోట్ల వాయిదా వేయించాలని చూశారని అన్నారు.
చంద్రబాబు ప్రలోభాలు పెట్టి, భయపెట్టే ప్రయత్నం చేశారని.. 8 మంది ఎంపీటీసీలతో ఎస్ఐ సుధాకర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుక్కి ఫోన్ చేయించారని అన్నారు.వీడియా కాల్లో భాగ్యమ్మ అనే ఎంపీటీసీని బెదిరించారని.. పెనుకొండలో వైసీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని.. వాళ్ళను తీసుకెళ్ళినందుకే ప్రకాష్ రెడ్డి, ఉషశ్రీలపై కేసు పెట్టారని అన్నారు. ఎన్నికల్లో గెలవకపోవడంతో భయం క్రియేట్ చేయాలని చూశారని అన్నారు జగన్.
Also Read:-వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు
లింగమయ్య హత్య ఘటనలో 20మంది అటాక్ చేస్తే, ఇద్దరి మీద మాత్రమే కేసు పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బంధువులు, ఎమ్మెల్యే కొడుకు మీద ఎందుకు కేసులు పెట్టలేదని అన్నారు. ఎంపీటీసీలను ప్రలోభపెట్టిన రామగిరి ఎస్ఐపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు జగన్. లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర వేయించారని.. టీడీపీ వారినే సాక్షులుగా ఇందులో చేర్చారని అన్నారు జగన్.