సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు ఆయన ధైర్యం చెప్పారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేమని జగన్ అభిప్రాయపడ్డారు.
శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు అప్పుడప్పుడూ ఓడిపోయారు. చివరికి ప్రతి ఒక్కరు అర్జునుడిలా విజయం సాధిస్తారని జగన్ తెలిపారు. 99శాతం హామీల అమలుతో మనం తలెత్తుకునేలా పాలించామని జగన్ నేతలతో వెల్లడించారు.
అటు వైసీపీ నేతలు, కార్యకర్తలు మీద జరుగుతున్న దాడులు పై స్పందించిన జగన్ .. డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టి మీ అందరి దగ్గరకు వచ్చి భరోసా కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.