గురువారం వినుకొండలో వైసీపీ యువనేత రషీద్ దారుణ హత్య ఏపీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుండి హుటాహుటిన తాడేపల్లికి చేరుకున్నారు. రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఇవాళ ( జూలై 19, 2024 ) ఉదయం వినుకొండ బయలుదేరారు జగన్. భారీ వర్షం కారణంగా రోడ్డు మార్గాన బయలుదేరిన జగన్ కు అడుగుడగునా పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.
జగన్ కాన్వాయిలోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చి పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు పోలీసులు. దీంతో జగన్ ప్రైవేట్ వాహనంలో బయలుదేరారు జగన్.అంతే కాకుండా జగన్ వెంట బయలుదేరిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని తెలిపారు.రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి వెళ్లిపోవాలని తెలిపారు పోలీసులు.
Also Read:-శ్రీవాణి దర్శనం టికెట్లు 1000కి పరిమితం
వినుకొండ పట్టణంలో ప్రశాంత వాతావరణం ఉందని, జనసమీకరణ చేసి బలప్రదర్శన చేయద్దని తెలిపారు పోలీసులు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వచ్చి శాంతిభద్రతకు భంగం కలిగించొద్దని కోరారు. రషీద్ హత్య రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో జగన్ వినుకొండ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.