మూడోసారి ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణం..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య ప్రమాణం చేయించారు. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.  మంత్రుల ప్రమాణం పూర్తయిన తర్వాత జగన్ కు అవకాశం కల్పించారు ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య. అనంతరం స్పీకర్ వద్దకు వెళ్లిమర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.