వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ.. ఢిల్లీపై ఫోకస్..

ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ అధినేత జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పార్టీలోని కీలక నేతలతో భేటీ అయ్యి ఓటమికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చిన జగన్ ఇప్పుడు వైసీపీ ఎంపీలతో భేటీ అవుతున్నారు.రాజ్యసభలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. రాజ్యసభలో వ్యవహరించాల్సిన తీరు, ఓటమికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణపై ఎంపీలతో జగన్ చర్చించనున్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినప్పటికీ రాజ్యసభలో 11మంది ఎంపీల బలం ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఘర్షణ వైఖరి కాకుండా సన్నిహితంగానే మెలగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభలో కూడా వైసీపీకి 4మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి కేంద్రానికి వైసీపీ అవసరం కచ్చితంగా ఉంటుంది కాబట్టి కేంద్రం పట్ల వ్యూహాత్మక వైఖరితో వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.