కచ్చితంగా న్యాయమే గెలుస్తుంది.. ప్రతి సైనికుడికి అండగా ఉంటా: వైఎస్ జగన్ ట్వీట్..

కచ్చితంగా న్యాయమే గెలుస్తుంది.. ప్రతి సైనికుడికి అండగా ఉంటా: వైఎస్ జగన్ ట్వీట్..

ఏపీలో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా స్పందించారు. తాజాగా మరో ట్వీట్ చేశారు జగన్...  రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని.. ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయమే గెలుస్తుందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు జగన్.

ఈ యుద్ధంలో తమ కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతున్నాయని.. ప్రతి సైనికుడికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నడుస్తోందని.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, పార్టీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు జగన్.