
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని.. కాశినాయన క్షేత్రాన్ని కూల్చుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఆలయాల పట్ల వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కార్ కు లేదని అన్నారు జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశినాయన క్షేత్రాన్ని కూలుస్తుందని.. కాశినాయన ఆలయ అభివృద్ధికి వైసీపీ ఎంతో కృషి చేసిందని అన్నారు జగన్.
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని కోరానని.. ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పానని అన్నారు.
నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025
తమ ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసిందని... మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదని.. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది అంటూ ట్వీట్ చేశారు జగన్.
ALSO READ | దర్శకుడు భారతీరాజా కుమారుడు మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమల్ హాసన్, పవన్ కళ్యాణ్