రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్..

ఈనాడు సంస్థల అధినేత మీడియా దిగ్గజం రామోజీ రావు మరణంపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ ( ట్విట్టర్ ) ద్వారా స్పందించారు జగన్. రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని,  రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు జగన్.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ ఇవాళ తెల్లవారుజామున మరణించారు.ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూన్ 5న హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం రాత్రి వెంటిలేటర్‌పై రామోజీ రావుకు కృత్రిమ శ్వాసను అందించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు విఫలం అయ్యి మృతి చెందారు రామోజీ.