ప్రశ్నిస్తానన్న భయం కాబట్టే.. ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ట్వీట్..

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా గడవకముందే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒకవైపు వైసీపీ నాయకులపై వరుస దాడులు, హత్యలు మరో వైపు అత్యాచారాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యపై ఢిల్లీలో నిరసన స్వరం వినిపించేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. సోమవారం ( జూలై 22, 2024 ) నాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన జగన్ చంద్రబాబు సర్కార్ పై ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 50 రోజుల్లోనే అన్నింటా వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని అన్నారు.ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేనంతగా ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.  దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందని అన్నారు జగన్.

Also Read:-ఐదు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రస్తుత అసెంబ్లీలో అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షం మాత్రమే ఉన్నాయని,ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది కాబట్టి, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలని అన్నారు.ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయంతోనే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదని అన్నారు.ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత  ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతోనే..తనను ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని అన్నారు జగన్.