ఢిల్లీలో జగన్ ధర్నా సక్సెస్... మద్దతు తెలిపిన ఇండియా కూటమి పార్టీలు... 

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాతో పాటు దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ఫోటో గ్యాలరీ కూడా ప్రదర్చించారు. జగన్ ధర్నాకు జాతీయస్థాయిలో మద్దతు లభించింది. ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు ఈ దాడులను ఖండించి జగన్ కు మద్దతు తెలిపారు.

Also Read:-జగన్ తప్ప, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీలోకి.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

వైసీపీ నిరసనకు జాతీయస్థాయిలో 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సమాజ్‌వాదీ, ఐయూఎంఎల్, అన్నాడీఎంకే, శివసేన..
టీఎంసీ, జార్ఖండ్ ముక్తిమోర్చా, వీసీకే, ఆప్‌ పార్టీల నాయకులు జగన్ కు మద్దతు తెలిపారు. వైసీపీకి మద్దతు తెలిపినవారిలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ శివసేన నుండి ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నుండి నదీముల్ హాక్, అన్నా డీఎంకే నుండి తంబీ దురై వంటి కీలక నేతలు ఉన్నారు. వైసీపీ నేతలపై దాడులను తీవ్రంగా ఖండించిన నేతలు విపక్షాలపై దాడులు, అరాచకాలు సంప్రదాయం కాదని హితవు పలికారు.