ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి సొంత గూటికి చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్కే నాకు చాలా దగ్గర మనిషి, ఆయన ఎక్కడున్నా బాగుండాలి, సమానంగా ఉండాలి, సంతోషంగా ఉండాని కోరుకుంటానని అన్నారు. ఆయన మీద చాలా ఒత్తిడులు ఉన్నాయని, ఒక చెల్లెలిగా ఆయనను అర్థం చేసుకున్నానని అన్నారు. ఒక మంచి పర్సన్ రాంగ్ ప్లేస్ లో ఉన్నారని అన్నారు.
ఆర్కే తిరిగి పార్టీలో చేరిన నేపథ్యంలో హ్యాపీగా ఉన్న వైసీపీ శిబిరంలో ఆయనపై ఒత్తిడులు ఉన్నాయన్న షర్మిల కామెంట్స్ కలవరపాటుకు గురి చేసేలా ఉన్నాయి. షర్మిల కామెంట్స్ ని బట్టి చుస్తే, ఆర్కే ను బ్లాక్ మెయిల్ చేసి తిరిగి పార్టీలోకి రప్పించారా అన్న అనుమానం మొదలవుతోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటించే సందర్భంలో ఆర్కే గురించి మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల ఇలా స్పందించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసల్లా వ్యవహరిస్తున్నాయని ఎండగట్టారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, బాబులు ఇద్దరు విఫలమయ్యారని, రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా వచ్చేదని అన్నారు.పర్వతాల్లాంటి వైసీపీ, బీజేపీలను ఓడించాలంటే కలిసి పోరాటం చేయాలని భావించే కమ్యూనిస్టులతో పొత్తుకు ముందుకు వచ్చామని అన్నారు.