హుజూరాబాద్ ఓటమిని జనం మరవాలనే వరి కిరికిరి

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ వరి కిరికిరి చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ఢిల్లీకి పోయి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పి.. ఉత్తి చేతులతో తిరిగొచ్చారని విమర్శించారు. అపాయింట్మెంట్ లేకుండానే ఎందుకు పోయారని దుయ్యబట్టారు. కేసీఆర్ కథ చూస్తుంటే.. మూడేండ్లు కర్రసాము నేర్చుకుని, మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరులా ఉందన్నారు. రైతులు కల్లాల్లో ధాన్యం పెట్టుకొని, వర్షానికి తడుస్తూ గుండెలు చెరువై కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం యాసంగి గురించి పక్కనపెట్టి వెంటనే కల్లాల్లోని ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు.