YS Sharmila : షర్మిల అరెస్ట్.. నేలపై కూర్చోని నిరసన

YS Sharmila  :  షర్మిల అరెస్ట్.. నేలపై కూర్చోని నిరసన

వైఎస్ఆర్టీపీ అఫీసు ముందు ఆ  పార్టీ చీఫ్  షర్మిలను  పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  మహిళా కారిస్టేబుల్ తో  పాటుగా ఎస్ ఐ రవీందర్ పై షర్మిల చేయిచేసుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసేందుకు పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్న షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఆమె వారిని నెట్టేశారు. దీంతో లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించారు.  

తనను ఎందుకు అరెస్ట్ చెప్పాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. పర్సనల్ పనులకు తనని బయటకు వెళ్లనివ్వరా అని షర్మిల ప్రశ్నించారు. షర్మిలతో తన గన్ మెన్ ను కూడా వెళ్లకుండా పోలీసులు ఆపేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. పోలీసులు కేసీఆర్  కోసమే పనిచేస్తున్నారని షర్మిల ఆరోపించారు.  

TSPSC  పేపర్ లీకేజీ పై ఏప్రిల్26 వ తేదీన హైకోర్టు పర్మిషన్ మేరకు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తామని షర్మిల చెప్పారు.  పేపర్  లీకేజీ పైన రాష్ట్ర ప్రభుత్వం  స్పష్టత ఇవ్వకుండా మళ్ళీ పరీక్షలు పెట్టడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. నిజమైన పేపర్ లీకేజీ కారకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే  పేపర్ లీకేజీపై సీబీఐతో విచారణ చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు.