కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు. రాహుల్ గాంధీకి ఇది ఆనందకరమైన స్పెషల్ పుట్టినరోజని.. భగవంతుడు ఆయనకు దీర్ఘాయుషును ప్రసాదించాలని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పట్టుదల, సహనంతో నిత్యం ప్రజలకు ఇలాగే స్పూర్తినిస్తూ... ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని కోరారు. ఆరోగ్యంతో ,సుఖసంతోషాలతో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వైఎస్ షర్మిల తన వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని టాక్. అయితే ఈ ప్రచారాన్ని షర్మిల ఖండించారు.