డీకే శివ కుమార్ కు బర్త్ డే విషెస్ చెప్పిన షర్మిల

డీకే  శివ కుమార్ కు బర్త్ డే విషెస్ చెప్పిన షర్మిల

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.  ప్రియమైన సోదరుడు డీకే  శివకుమార్ కు తన  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.  ప్రియమైన సోదరుడు డీకే  శివకుమార్ కు తన  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు.  అసెంబ్లీ ఎన్నికలలో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత ఈ పుట్టినరోజు మీకు ఎంతో స్పెషల్ అని అన్నారు.  కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరారు. 

 కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ట్రబుల్ షూటర్ గా పార్టీ నేతలను ఏకదాటిపై ఉంచడంలో సక్సెస్ అయ్యారు. సీఎం రేసులో సిద్ధరామయ్యతో పోటీపడుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుపుతోంది.